- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టి-హబ్‌లో ది8 మ్యాట్రిక్స్ డిజైన్ కాంక్లేవ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి..
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్‌లోని టి - హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ది8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ పోస్టర్‌ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. నవంబర్ 20వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్ ను నిర్వహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డిజైన్, టెక్నాలజీ రంగంలో సృజనాత్మకతను, సహకార వృద్ధిని ప్రోత్సహించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల వృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యం అని తెలిపారు.
ది 8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ అధికార ప్రతినిధి రాజ్ సావంకర్ మాట్లాడుతూ అర్థవంతమైన చర్చలు, సహకారానికి మా ఈ సదస్సు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని తెలిపారు. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలను రూపొందించడానికి, నెట్‌వర్కింగ్ అవకాశాలతో తోటివారితో అనుసంధానం కావడానికి ఇది అవకాశం కల్పిస్తుందని తెలిపారు.