బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా

by Sridhar Babu |   ( Updated:2024-02-23 14:08:20.0  )
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా
X

దిశ, ఎల్బీనగర్ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో ఉంటానని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.. బీ రెడ్డి నగర్ లోని కార్పొరేటర్ లచ్చిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న తనకు మల్కాజ్గిరి పార్లమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నుండి పోటీ చేయమన్నా

అక్కడ పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పరిపాలనలో భారతదేశం ఆర్థికంగా మూడో స్థానానికి చేరుకోను వెల్లడించారు. ప్రపంచ దేశాలు మోడీని గౌరవిస్తున్నాయని, ఆయన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో ఉన్నదని కొనియాడారు. 54 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, లచ్చిరెడ్డి, నవజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story