- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండాపూర్ లో భారీ అగ్నిప్రమాదం
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొండాపూర్ లోని గెలాక్సీ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయభ్రాంతులకు గురైన వారు అపార్ట్మెంట్ నుంచి కిందకి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అందులో ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. ఇదే నెలలో మాదాపూర్ మీనాక్షి అపార్ట్మెంట్ లోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వరుస ప్రమాద ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.