- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతాం
దిశ, రవీంద్రభారతి : తెలంగాణ ఏర్పాటుకు పోరాట నారీమణి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడీ కంచెను బద్దలుగొట్టి ప్రజా భవన్ కు జ్యోతిరావు పూలే పేరు పెట్టామని, హ్యాండ్లుమ్ యూనివర్సిటీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నామని ముఖ్యమంత్రి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారిగా సాంప్రదాయ కూచిపూడి, జానపద శైలిలో నృత్య రూపకం ప్రదర్శించారు. అభినయ కళాతపస్వి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఈ ప్రదర్శన చేసి రాజకీయ దిగ్గజాలు, కళాప్రియుల ప్రశంసలు అందుకున్నారు.
చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నాట్య రూపంలో తిలకించి జోహార్ ఐలమ్మ, జై తెలంగాణ అంటూ రవీంద్రభారతి ఆడిటోరియం మార్మోగిపోయింది. పోరాట ధీశాలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం చాకలి ఐలమ్మ నృత్య రూపకం ప్రదర్శించి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్యంతం నృత్య రూపకం తిలకించి అభినందించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ప్రధాన మంత్రులు గా ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు భూ సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. భూమి పేదల ఆత్మ గౌరవం అని, పేదల జీవన ఆధారమని, ఐలమ్మ స్ఫూర్తి తో ధరణి ని కట్టుదిట్టంగా అమల్లోకి తెచ్చి పేదల భూములు కాపాడుతున్నామని చెప్పారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేతలు వి. హనుమంతరావు, ఎ.కోదండ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా సుమన్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, సాంస్కృతిక సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, డా.కంచె ఐలయ్య, ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత తదితరులు అలేఖ్య పుంజాల బృందాన్ని అభినందించారు. తెలంగాణ ముద్దు బిడ్డ చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు. ఈ తరానికి రానున్న తరానికి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఈ నృత్య రూపకం రూపొందించి ప్రదర్శించినట్లు డా. అలేఖ్య తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప శాస్త్రీయ నృత్య రూపకం అని డా. కంచె ఐలయ్య అభివర్ణించారు.