తెలంగాణలో ఎన్నికలు ఆ నెలలోనే: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
తెలంగాణలో ఎన్నికలు ఆ నెలలోనే: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, శేరిలింగంపల్లి: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుండే దృష్టి సారించాయి. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అంటూ ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలు ఏమీ ఉండబోవని ఇది వరకే ప్రకటించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

మంగళవారం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలో జరిగిన ఖాజాగూడ చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. చెరువులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని, రానున్న అక్టోబర్, నవంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. అంతలోపు చెరువులను అభివృద్ధి చేయాలని చెరువులను దత్తత తీసుకున్న రియల్టర్లకు సూచించారు కేటీఆర్. దీంతో అందరిలోనూ అసెంబ్లీ ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చినట్లు అయింది.

Advertisement

Next Story

Most Viewed