Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

by Shiva |   ( Updated:2024-09-12 07:42:08.0  )
Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
X

దిశ, శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకుని లోపలికి వెళ్లనివ్వలేదు. కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కొందరు గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై, ఆయన‌పై కొడు గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ( Arekapudi Gandhi Vs Kaushik Reddy )

ఈ క్రమంలోనే ఇంటి అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఇంట్లో పనిచేసే ఆడవాళ్లకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు పలువురు మీడియా ప్రతినిధుకు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గాంధీ అనుచరులను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Advertisement

Next Story