IPL Match: ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు తీసుకెళ్తున్నారా?

by Hamsa |
IPL Match: ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు తీసుకెళ్తున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. ఈ క్రమంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల వస్తువులను స్టేడియంలోకి తీసుకురావద్దని పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, కెమెరాలు, సిగరేట్లు, వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, చాకులు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, ఫర్ఫ్మూమ్స్, బయట తినుబండారాలను తీసురావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story