- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ,హైదరాబాద్ బ్యూరో : ప్రభుత్వ ఉన్నత అధ్యయన సంస్థ, మాసాబ్ ట్యాంక్ లోని బి.ఎడ్, ఏం ఎడ్ కోర్సులకు పూర్తిగా తాత్కాలిక పద్ధతిపై బోధించడానికి గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ఏ ఉషారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫిలాసఫీ , సైకాలజీ , సోషియాలజీ , రీసెర్చ్ మెథడాలజీ , స్టాటిస్టిక్స్ , ఇంగ్లీష్ , ఐసీటి/ కంప్యూటర్ ఎడ్యుకేషన్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ , విజువల్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో లెక్చరర్లు పూర్తిగా తాత్కాలిక పద్ధతిపై బోధించడానికి దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు.
అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఈడి లో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని, బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్ కాఫీలతో ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4.30 గంటల వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ ఇ ) లో తమ దరఖాస్తులను అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు . ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్ 9963119534 లో సంప్రదించాలన్నారు .