సెట్విన్ ఆధ్వర్యంలో ఎల్పిజి కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

by Kalyani |
సెట్విన్ ఆధ్వర్యంలో ఎల్పిజి కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, చార్మినార్ : రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో ఎల్పిజి రంగంలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వివిధ కోర్సుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు వివరించారు. ఎల్పిజి మెకానిక్ (మూడు నెలలు), ఎల్పిజి డెలివరీ బాయ్ (రెండు నెలలు) ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. తమ సంస్థకు చెందిన శిక్షణా కేంద్రాలైన మోతి గల్లి, సీతాఫల్ మండి లలో ప్రవేశపెడుతున్నామని, శిక్షణ ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్పిజి షోరూం లలో ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కూడా తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ వారి సహకారంతో నిర్వహించబడుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు 9010157312 లేదా 8142439336 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed