బస్‌ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

by Disha Web |
బస్‌ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వి.రవిందర్‌ సతీమణి నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగినులను సన్మానించారు.వివిధ పోటీల్లో రాణించిన ఉద్యోగినులకు బహుమతులను అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. మహిళాలోకం ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత శిఖరాలను చేరుకోవడం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు. గృహిణిలకు ఇంట్లో ప్రతి రోజూ పరీక్షే ఉంటుందని, గృహిణీగా బాధ్యతల్ని నెర‌వేరుస్తూనే టీఎస్‌ఆర్టీసీలో మహిళా ఉద్యోగినీలు సమర్థవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు.

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ మహిళా ఉద్యోగినులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని సంస్థ సీవోవో డాక్టర్‌ వి.రవిందర్‌ అన్నారు. 11 రీజియన్లలో ఐదుగురు మహిళల‌ను ఆర్‌.ఎంలుగా నియమించారని గుర్తు చేశారు. మహిళా ప్రయాణికులకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నామని, ప్రధాన బస్టాండ్‌ల్లో టాయిలెట్లు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్సుల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఈడీ(ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed