మెడికో ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి: ఎస్ఎఫ్ఐ

by Kalyani |
మెడికో ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి: ఎస్ఎఫ్ఐ
X

దిశ, సికింద్రాబాద్: మెడికో ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చట్టాలను ప్రభుత్వం పటిష్టంగా అమలుచేయక పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ముందు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ కిషన్ హాజరై మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విద్యార్థులు ధైర్యంగా ఉండి పోరాడాలన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న అమానుష్యమైన దాడిని ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, రవి నాయక్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చట్టాలను మరింత కఠినతరం చేసి, పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయికిరణ్, కృష్ణ, అజయ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story