పాతబస్తీలో నయా దందా..

by Sumithra |
పాతబస్తీలో నయా దందా..
X

దిశ, చార్మినార్​ : వేసవి సెలవులు ముగియడంతో సోమవారం హైదరాబాద్​ పాతబస్తీలో స్కూల్స్​ రీ ఓపెన్​ అయ్యాయి. కొన్ని ప్రయివేట్​ పాఠశాలల యాజమాన్యం నయా దందా మొదలుపెట్టింది. స్కూల్​ ఫీజులు కూడా ఈ విద్యా సంవత్సరానికి 2023 - 2024 నకు గాను ఘననీయంగా పెంచింది. నర్సరీకి ఒక్కొక్క విద్యార్థికి రూ.12వేలు నుంచి రూ.25వేలు వసూలు చేస్తున్నారు. కేవలం రూ.12వేలు అయితే స్కూల్​ ఫీజు మాత్రమేనని, బుక్స్​, యూనిఫాం, టై, బెల్ట్​, సాక్స్​లు వేరుగా కొనుక్కోవాలని , ఒక వేళ రూ.25వేలు కడితే డొనేషన్​తో సహా అన్నీ అందులోనేనని అమాంతం పాఠశాల స్కూల్​ ఫీజులను పెంచేశాయి. ఇంకా కొన్ని కార్పొరేట్​ పాఠశాలలో మాత్రం రూ.30వేల నుంచి రూ.60వేల వరకు వసూలు చేస్తున్నారు. 10వ తరగతికి రూ.రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు.

కేవలం స్కూల్​ ఫీజులు మాత్రమేనని, బుక్స్​, యూనిఫాంలకు సెపెరేట్​గా వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా పాఠశాలలోనే తప్పనిసరిగా బుక్స్​ కొనుక్కోవాలని నిబంధనలు పెట్టి డబుల్​ రేట్​లు వసూలు చేస్తున్నారు. వర్క్​ బుక్స్​పై ఎన్న ఎంఆర్​పి ధరలను బ్లాక్​ ఇంక్​తో కొట్టేవేసి మరీ అదనపు ధరలు వేసి అచ్చం ఎంఆర్​పీ ధరలలానే ముద్రిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి వర్క్​ బుక్స్​ వెనుక అదనంగా రూ.500 వసూలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం కారణంగానే ప్రయివేట్​ పాఠశాలల యాజమాన్యం ముక్కుపిండి అధిక ఫీజులు, వర్క్స్​ బుక్స్​పై అధిక రేట్లతో డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రయివేట్​ పాఠశాలలకు ఫీజు నిబంధనలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఫీజులను ప్రయివేట్​ పాఠశాలల పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed