- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ వాసులు అలర్ట్... నేటి నుంచి 3నెలల పాటు బాలానగర్‌లో ట్రాఫిక్ మళ్లింపు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులు జరుగనున్నాయి. 28 మార్చి 2023 (మంగళవారం) నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపును చేపట్టనున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రహదారుల గుండా వెళ్లాలని సూచించారు.
సూచనలు:
* కూకట్‌పల్లి నుంచి అమీర్‌పెట్ వైపు వచ్చే ప్రయాణికులు కూకట్ పల్లి మెట్రో స్టేషన్‌లో యూ టర్న్ ఎడమ మలుపు ఐడీఎల్ లేక్ రోడ్ గ్రీన్ హిల్స్ రోడ్-యూ టర్న్ రెయిన్‌బో విస్టాస్ ఎడమ మలుపు ఖైత్లాపూర్ ఫ్లైఓవర్-ఎడమవైపు పార్వత్‌నగర్ టాడీ కాంపౌండ్ వైపు మళ్లించాలని సూచించారు. కావూరి హిల్స్ వైపు ఎడమ వైపు మలుపు నీరు జంక్షన్-జూబ్లీ చెక్ పోస్ట్- ఎడమ మలుపు యూసూఫ్‌గూడ రోడ్డు మైత్రివనం, అమీర్ పేట వైపు
* కూకట్‌పల్లి నుంచి బేగమ్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి వై జంక్షన్ - బాలానగర్ ఫ్లైఓవర్-న్యూబోయిన్‌పల్లి జంక్షన్ కుడి మలుపు తాడుబండ్ రైట్ టర్న్- ప్యారడైస్ జంక్షన్ రైట్ టర్న్ బేగంపేట్ ఫ్లైఓవర్ లో మళ్లించాలని సూచించారు.
* బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్ పేట్ వైపు వచ్చే ప్రయాణికులు బాలానగర్ ఫ్లైఓవర్-న్యూ బోయిన్‌పల్లి జంక్షన్ తాడ్‌బండ్ కుడి మలుపు- ప్యారడైజ్ కుడి మలుపు- బేగంపేట ఫ్లైఓవర్ కుడి మలుపు-అమీర్‌పేట్ కింద మళ్లించాలని సూచించారు.
* మూసాపేట్, గూడ్‌షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే ప్రయాణికులు ఐడిఎల్ లేక్ రోడ్- గ్రీన్ హిల్స్ రోడ్ -యు-టర్న్ - రెయిన్ బో విస్టాప్-ఎడమ మలుపు ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ ఎడమ వైపు పార్వతినగర్ టోడి కాంపౌండ్- ఎడమ మలుపు వైపు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. కావూరి హిల్స్ మీరస్ జంక్షన్- జూబ్లీ చెక్-పోస్ట్ ఎడమ మలుపు-యూసుఫ్ గూడ రహదారి-మైత్రివనం, అమీర్‌పేట వైపు వెళ్లాలని తెలిపారు.