- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్మాదుల ట్రైనింగ్‌కు అడ్డాగా హైదరాబాద్ మారింది : ఈటల
దిశ, బేగంపేట: ఉన్మాదుల ట్రైనింగ్ కు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని, సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడి సంఘటనే దీనికి నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సంఘటన చిన్న విషయం కాదని, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .హైదరాబాద్ కాస్మో ప్రాంత నగరమని, గతంలో రక్తాన్ని చిందించిన నగరం కాబట్టి..మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎంపీగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక ఇస్తానని అన్నారు. శుక్రవారం కుమ్మరి గుడిలోని ముత్యాలమ్మ ఆలయాన్ని పరిశీలించిన ఆయన స్థానికులతో కలిసి రెండు గంటల పాటు చర్చించారు.
అక్కడే ఉన్న మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్, పోలీసు సిబ్బందితో కలిసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కట్ర శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు.హిందూమతంపై ద్వేషం పెంచేలా 15 రోజులుగా ఇక్కడ హోటల్ లో మీటింగ్ నడుస్తుంది. అందులో ప్రభావితం అయిన ఒక ముస్లిం వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని కాళ్ళతో తన్ని ధ్వంసం చేశారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. అతనికి సెల్ ఫోన్ లు అందించి విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు పెడుతుంటే మీరేం చేస్తున్నారన్నారు.ఇక్కడి ప్రజలు రేపు సికింద్రాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు.వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను.