- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad Collector : గర్భిణీలు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి
దిశ,హైదరాబాద్ బ్యూరో : గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా పోషక విలువలు ఉన్న ఆహారం, ఆకుకూరలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పాన్ బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, ఫిమేల్ వార్డ్, డ్రగ్స్ స్టోర్, ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని పరిశీలించారు. అంతేకాకుండా వైద్య చికిత్సల కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ సంభాషించారు.అక్కడ వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ గర్భిణీలతో మాట్లాడుతూ రక్తహీనత రాకుండా గర్భిణీలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఎన్ సీ డీ పోర్టల్ ఏ విధంగా జనరేట్ చేస్తూ మందులు ఇండెంట్ చేస్తున్నారని ఆన్ లైన్ లో పరిశీలించారు.
రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పల్లి పట్టీలు, ఖర్జూరాలు తినాలని, ఐరన్ మాత్రలు వేసుకోవాలని సూచించారు.ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఎదుగుదల బాగుంటుందన్నారు. ప్రతి నెల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరాలన్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన సాధారణ మరమ్మత్తుల వివరాలను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎస్పీహెచ్ఓ డాక్టర్ జయశ్రీ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.