ప్రధాని మోదీ సభ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్‌ బంద్

by srinivas |   ( Updated:2023-11-06 10:33:08.0  )
ప్రధాని మోదీ సభ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్‌ బంద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోదీ సభ కారణంగా మంగళవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్‌లను మూసివేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ రాజ్ భవన్ నుంచి ఎల్బీ స్టేడియం చేరుకునే రోడ్డు మార్గంలో రద్దీగా ఉండే ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్‌‌లను భద్రత ఏర్పాట్లలో భాగంగా మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారుల సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రధాని పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని, సభ వేదికగా బీసీలకు ప్రధాని పలు హామీలు ఇవ్వనున్నారు.

Advertisement

Next Story