Breaking: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. బిగ్ అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ

by srinivas |   ( Updated:2023-07-24 12:31:54.0  )
Breaking: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. బిగ్ అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, మూసాపేట్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కోఠి, బేగంపేట్, సికింద్రాబాద్‌తోపాటు దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, నాంపల్లిలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. అతి భారీ వర్షం పడే సూచనలున్నట్లు తెలిపారు. రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

దీంతో నగర వాసులను జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. కరెంట్ స్తంభాల వైపు వెళ్లొద్దని పేర్కొన్నారు. నాలాలు పొంగి పొర్లే అవకాశం ఉందని సూచించారు. రోడ్లపై వాహనాలు దారులు బీ కేర్ ఫుల్‌గా డ్రైవింగ్ చేయాలన్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ఆఫీసుల నుంచి ఇళ్ల వెళ్లే వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ రెండు గంటల పాటు వీలైంత వరకు సురక్షిత షెల్టర్లలో ఉండాలని చెప్పారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని తెలిపారు. వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read More: Weather Update : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రేపు అత్యంత భారీ వర్షాలు..!

Advertisement

Next Story