ఉప్పల్ లో భారీ వర్షం... నీటమునిగిన కాలనీలు

by Nagam Mallesh |
ఉప్పల్ లో భారీ వర్షం... నీటమునిగిన కాలనీలు
X

దిశ,ఉప్పల్ : ఉప్పల్ లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునిగాయి. ఉప్పల్ వెంకటేశ్వర టెంపుల్ రోడ్డు మల్లికార్జున నగర్ కాలనీలో ఇండ్లలోకి దూసుకు వచ్చింది వరద నీరు. దాంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అధికారులు నాలా పూడికతీత పనులు తూతూ మంత్రంగా చేపట్టడం వల్లనే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ట్విట్టర్లో కంప్లైంట్ పెట్టడం వల్లనే అధికారులు స్పందించారని లేకుంటే పట్టించుకునే వారు లేరని స్థానికులు అంటున్నారు.

Advertisement

Next Story