- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Huge Rain:హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుంభవృష్టి వర్షం పడుతోంది. దెబ్బతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, నాంపల్లితో పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎన్‌ఆర్‌నగర్, బేగంపేట, మెహిదీపట్నంలో భారీగా వర్షం పడుతోంది.ఖైరతాబాద్ జంక్షన్‌లో నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో చెట్లకు కిందకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
కాగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. గురువారం, శుక్రవారం ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, ఆదిలాబాద్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.