- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అందాల నటుడు శోభన్ బాబు: గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్

దిశ, అంబర్ పేట్: నటభూషణ్ శోభన్ బాబు అందాల నటుడని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. శోభన్ బాబు 87వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నటుడు జీవిత రాజశేఖర్ దంపతులకు శోభన్ బాబు సిల్వర్ క్రౌన్ ప్రధానోత్సవ కార్యక్రమం తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో నిర్వహించారు. మంచి ముఖ్య అతిథిగా మోతే లత పాల్గొని రాజశేఖర్ దంపతులకు సిల్వర్ క్రౌన్ ప్రధానం చేశారు.
సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాట్లాడుతూ శోభన్ బాబు అనేక కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. తన అభిమాన నటుడు శోభన్ బాబు అని తెలిపారు. సిల్‌వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు సభాధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ రామకృష్ణ, సినీ రచయిత మద్దెల శివ కుమార్, వెంకటేశ్వర రావు, లాల్ బహదూర్ శాస్త్రి, పద్మారావు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ గాయకులు సుభాష్, శ్రీనివాస్, రాజన్ సాయి, ప్రసన్న ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.