వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

by Sridhar Babu |
వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
X

దిశ, ఖైరతాబాద్ : వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 2024 ను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి అవగాహన ర్యాలీ నెక్లెస్ రోడ్ జల విహార్ పార్క్ సాధికారిత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికలాంగులు, వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్లతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో వృద్దాశ్రమాలు నిర్మించనున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు, వృద్ధులను చిన్నచూపు చూడొద్దని కోరారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకోనున్నట్టు తెలిపారు. వృద్ధులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి రాష్ట్ర స్థాయి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజా వరకు కొనసాగింది. దాదాపు వెయ్యి మంది వృద్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల, వయవృద్ధుల, మహిళా సంక్షేమ శాఖ సంచాలకులు బి.శైలజ, సహ సంచాలకులు రాజేందర్, ఎన్జీఓ సంఘాలు, అనుబంధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story