Gold Robbery: సికింద్రాబాద్‌లో దొంగల బీభత్సం.. కిలో బంగారం దోచుకెళ్లిన వైనం

by Shiva |
Gold Robbery: సికింద్రాబాద్‌లో దొంగల బీభత్సం.. కిలో బంగారం దోచుకెళ్లిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా బైక్‌పై వచ్చి దర్జాగా కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. మోండా మార్కెట్‌లో దుకాణంలో నుంచి బంగారాన్ని ప్రఫుల జైన్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్ తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో క్లాక్ టవర్ వద్దకు రాగానే అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు మెరుపు వేగంతో బైక్‌‌పై వచ్చి ప్రఫుల్ జైన్ అనే వ్యక్తి నుంచి బంగారం బ్యాగ్‌ను లాక్కెళ్లారు. బాధితుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మోండా మార్కెట్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story