పాదచారుల కోసం రూ.100 కోట్లు.. GHMC ప్రణాళిక ఇదే..!

by Nagaya |   ( Updated:2022-12-16 03:20:55.0  )
పాదచారుల కోసం రూ.100 కోట్లు.. GHMC ప్రణాళిక ఇదే..!
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే ఎక్కువ మంది మృతి చెందుతన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ పాదచారుల భధ్రతపై దృష్టి సారించింది. ఇందుకు రూ. వంద కోట్ల అంచనా వ్యయంతో తో 38 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా 23 ప్రాంతాల్లో వీటి ఏర్పాటు సాధ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇందుకు నగరంలో నిత్యం రద్దీగా ఉండే మరో 23 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం రూ.75.65 కోట్ల వ్యయంతో 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని భావించిన జీహెచ్ఎంసీ వీటిలో ఇప్పటి వరకు ఎనిమిది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

వీటిలో రూ.28.10 కోట్ల వ్యయంతో చెన్నైషాపింగ్ మాల్ మదీనాగూడ, యశోద పియరల్ కాంప్లెక్స్ మియాపూర్, హైదరాబాద్ సెంట్రల్ మాల్పంజాగుట్ట, ఎన్ఎస్ కేకే స్కూల్ దగ్గర బాలానగర్, నేరేడ్ మెట్ బస్ స్టాఫ్ సెయింట్ ఆన్స్ స్కూల్ సికింద్రాబాద్, స్వప్న థియేటర్ రాజేంద్ర నగర్, ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎర్రగడ్డతో పాటు బంజారా హిల్స్‌లో త్రీడీ ఎఫెక్ట్‌తో ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు మెట్రోరైలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు దిగిన తర్వాత రోడ్డు దాటేందుకు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నట్లు గుర్తించిన మెట్రో రైల్ 60 మెట్రో రైలు స్టేషన్‌ల వద్ద కూడా పాదచారుల రక్షణ, ప్రమాదాల నివారణ కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఇప్పటికే చేపట్టింది.

నత్తనడకన ఫుట్‌పాత్‌ల పెంపు

మహానగరంలో రోడ్ల పొడువునకు తగ్గట్టు ఫుట్ పాత్ లు లేకపోవటంతో ఫుట్ పాదచారులకు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టిన చర్యలు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ.31.11 కోట్లతో ఫుట్‌పాత్ పెంపు పనులు చేపట్టగా ఇందులో రూ.10 కోట్ల పనులను పూర్తి చేసినట్లు, మరో రూ.21.11 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read....

గన్నీ బ్యాగ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

Next Story

Most Viewed