- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగు కోట్ల మంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను నలుగురు దోచుకుంటున్నారు
దిశ, జూబ్లీహిల్స్ : తెలంగాణ ప్రాంతానికి అన్ని విధాలా నష్టము చేసిన భారాస ప్రభుత్వం ని రాబోవు ఎన్నికల్లో ఓడించేందుకే అందరూ సమాయత్తం కావాలి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సవేర ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవిదేశాల్లో భారత్ పేరు ప్రఖ్యాతులు పొందుతుంటే, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ లతో నడుస్తుందన్నారు. అన్ని రంగాల్లో నీకు ఎంత, నాకు ఇంత అనే సంప్రదాయంతో నడిపిస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగులు కల్పించారో చెప్పాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి అన్నారు. కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏది వచ్చినా తెలంగాణకు నష్టమే అన్నారు. నిజాయితీపరమైన పాలన కావాలంటే బీజేపీని గెలిపించాలని, ప్రధాని మోడీ సందేశాన్ని ఇంటింటికీ తిరుగుతూ అందరికీ చేరవేయాలని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, కుంబాల గంగరాజు, అట్లూరు రామకృష్ణ, డాక్టర్ పద్మ వీరపనేని, జూటూరు కీర్తి రెడ్డి, లక్ష్మీనారాయణ, బంగారు ప్రశాంత్, ప్రేమ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కనకరాజు, విజయకుమార్, శివకుమార్, కొండపల్లి చంద్రమోహన్, రాజేష్, బరిగల జ్ఞానేశ్వర్, పులి రామ్, బడుగు సతీష్, అనంతలక్ష్మి, సుప్రియ గౌడ్, స్వప్న ఇంకా అధిక సంఖ్యలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.