నేనే అలాంటి వ్యక్తిని కాదు.. పార్టీ మార్పుపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి

by srinivas |   ( Updated:2023-10-25 12:31:16.0  )
నేనే అలాంటి వ్యక్తిని కాదు.. పార్టీ మార్పుపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మరికొంతమంది బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీకి హ్యాండ్ ఇవ్వబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జోరందుకుంది. దీంతో మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను గాలికి వచ్చి వెళ్లేవాడిని కాదని క్లారిటీ ఇచ్చారు. తనకంటూ కొన్ని విలువలు, ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. బీజేపీని వీడేది లేదని పేర్కొన్నారు. బీజేపీ తనకు చాలా ప్రాధాన్యతనిచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని కొందరు ఆ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కానీ భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ చెప్పడం బాధాకరమని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సీన్ మారిపోయింది. అప్పటి వరకూ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంది.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఒక్కసారిగా ఆ పార్టీకి తెలంగాణలో ఊపు వచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించింది. సర్వేలో కూడా ఆ పార్టీ బలపడినట్లు వెల్లడైంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నిన్నటి వరకూ జరిగిన ప్రచారానికి బలం చేకూరింది. దీంతో మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed