- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ అబిడ్స్ లో అగ్నిప్రమాదం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆదివారం మద్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయ భవనంలో రెన్నోవేషన్ పనులు చేస్తున్నారు. కొన్ని ఇనుప రాడ్లకు వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న ఇతర సామగ్రి అంటుకోవడంతో మంటలు చెలరేగినట్టు అక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. మంటలు విస్తరిస్తూ ఉండటంతో స్థానికులు, పక్కనే ఉన్న తాజ్ మహల్ హోటల్ ని సిబ్బంది, కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నిర్మాణ పనులకు ఉపయోగించే వస్తువులు పూర్తిగా కాలిపోవడం మినహా.. పెద్దగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తామన్నారు.
Next Story