- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫేక్ ఎంప్లాయీస్.. లంచాలతో అక్రమ కారుణ్య నియామకాలు
దిశ, సిటీబ్యూరో: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీలో ఫేక్ ఎంప్లాయీస్ రాజ్యమేలుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఒకరి కన్నా ఎక్కువ మంది జీహెచ్ఎంసీలో ఉద్యోగం కలిగి ఉండరాదన్న నిబంధనను తుంగలో తొక్కుతూ కొందరు ఉద్యోగులు అధికారులకు లంచాలిచ్చి, అడ్డదారిలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక్కో సర్కిల్‌లో డబుల్ డిజిట్‌లో ఈ రకంగా ఉద్యోగాల్లో చేరిన వారున్నట్లు సమాచారం. మొత్తం 30 సర్కిళ్లలో 50 నుంచి 60 మంది అడ్డదారిలో ఉద్యోగాలు దక్కించుకున్నట్లు తెలిసింది. వీరిపై ఇప్పటి వరకు వందల సంఖ్యల్లో ఫిర్యాదులొచ్చినా, ఎప్పటికప్పుడు విచారణ పేరిట అధికారులు జాప్యం చేస్తూ వీరిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉద్యోగులు సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్ జోన్లలో ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
తల్లీ, కొడుక్కు ఉద్యోగం..
2012 సంవత్సరం సర్కిల్ 14లో విధులు నిర్వహిస్తూ ఓ ఉద్యోగి మృతిచెందారు. అప్పటికే ఆయన భార్య కూడా జీహెచ్ఎంసీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఆమె జీహెచ్ఎంసీలోనే ఉద్యోగం చేస్తున్న విషయాన్ని దాచి ఆయన కుమారుడినంటూ, తన కుటుంబంలో ఎవరికి సర్కారు నౌకరి లేదంటూ తప్పుడు అఫిడెవిట్ సమర్పించి ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. వీరిలో ఒకరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకే స్థానంలోనే కొనసాగుతున్నారు. తప్పుడు అఫిడెవిట్లతో కారుణ్య నియామకాలు జరిగిన విషయం నాలుగేళ్ల తర్వాత బయటకు పొక్కడంతో ఓ యూనియన్ నేతలు రంగంలో దిగి, ఈ రకంగా ఉద్యోగాలు పొందిన వారి వివరాలను బయటకు తీశారు. దీంతో సదరు ఉద్యోగి తల్లి కూడా జీహెచ్ఎంసీలోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించటంతో ఆమెకు రిటైర్‌మెంట్ సమయంలో రావల్సిన బెనిఫిట్స్ చెల్లింపులను నిలిపేశారు. సదరు ఉద్యోగిణి నేటికీ తన బెనిఫిట్స్ కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. తన కొడుకు తనను సరిగ్గా చూడటం లేదని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి, తన బెనిఫిట్స్ తనకు చెల్లించాలని కూడా అధికారులను ప్రాధేయపడినట్లు తెలిసింది.
ఏళ్లతరబడి విచారణలు..
30 సర్కిళ్లలో దాదాపు 50 నుంచి 60 మంది ఇదే రకంగా తప్పుడ అఫిడెవిట్‌లు సమర్పించిన్నట్లు గుర్తించి వారిని విధుల్లో నుంచి తొలగించి, అప్పటి వరకు పొందిన అన్ని రకాల ప్రయోజనాలను రికవరీ చేయాలంటూ నేరుగా అడ్మిన్ సెక్షన్‌లో ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అడ్మిన్ సెక్షన్ ఈ వ్యవహారంపై విచారణాధికారులుగా అన్ని సర్కిళ్ల మెడికల్ ఆఫీసర్లను, డిప్యూటీ కమిషనర్లను నియమించింది. అధికారులు విచారణ నిర్వహించిన తప్పుడు అఫిడెవిట్‌లు సమర్పించి ఉద్యోగాలు దక్కించుకున్న విషయం వాస్తవమేనని నివేదికలను సమర్పించి దశాబ్దం కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారం చర్చకు వచ్చినప్పుడల్లా సదరు ఉద్యోగులు విచారణాధికారులను మేనేజ్ చేసుకుని నేటికీ ఆ ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు. ఓ సందర్భంగా విచారణాధికారులకు లంచాలిచ్చే ప్రయత్నం చేసి కూడా పట్టుబడిన ఫేక్ ఉద్యోగులపై కఠిన చర్యలెందుకు తీసుకోవటం లేదని పలు యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులను తప్పుదోపట్టించి తప్పుడు అఫిడెవిట్లతో ఉద్యోగాల్లో చేరిన వారు ప్రస్తుతం నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల మధ్య జీతాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అడ్డదారిలో విధుల్లో చేరిన వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే జీహెచ్ఎంసీ ఖజానాకు కొంత మేరకైనా ఊరట కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.