- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
25 బార్లు,పబ్‌లపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
దిశ ,హైదరాబాద్ బ్యూరో : డ్రగ్స్ వినియోగం పై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు . ఇందులో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 25 ప్రముఖ బార్ అండ్ పబ్స్ పై జాయింట్ కమిషనర్ ఖురేషీ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ రెండు జిల్లాలలోని 25 బార్లు , పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించడం జరిగిందని , డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు చేశామని తెలిపారు .
హైదరాబాద్ లో 12, రంగారెడ్డిలో 13 బార్లు ,పబ్ లపై శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టామన్నారు . ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ రీజం బార్ లో టీజీ న్యాప్ సభ్యులతో కలిసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ 17 మంది పై డ్రగ్స్ పరీక్షలు డిటెక్షన్ బాక్స్ తో చేశామని వివరించారు . డ్రగ్స్ ను సమూలంగా రూపుమాపేందుకు నిరంతరం దాడులు కొనసాగిస్తామని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు . ఈ దాడులలో అసిస్టెంట్ కమిషనర్లు ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు .