- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు ఉపాధి మార్గం.. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ
దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రస్తుతం మహానగరం వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త నగరానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలోనే పరిశ్రమలు, శాటిలైట్ టౌన్షిప్, ఐటీ కారిడార్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో పలు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. పొల్యూషన్ లేని కంపెనీల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే స్కిల్డెవలప్మెంట్యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది.
నెట్ జీరో సిటీ..
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో విస్తరిస్తున్నది. దీంతో ఆనాడు శివారుల్లో ఉన్న పొల్యూషన్ పరిశ్రమలు నేడు నగరంలో దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం నగరంలోనున్న విషపూరిత పరిశ్రమలను హైదరాబాద్నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని యోచించింది. కానీ పలు కారణాలతో ఆ పరిశ్రమలను ఎత్తివేయడం సాధ్యం కాలేదు. నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తు్న్నది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ ఫార్మా సిటీతో చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కలుషితమైన వాతవరణంలో జీవనం సాగించడం కష్టంగా ఉంటుంది.
అంతేకాకుండా ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని స్థానికులు గ్రహించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకు పొల్యూషన్ లేని కంపెనీలు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు హాని కలిగించే కంపెనీలు పెట్టబోమని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్అదే పద్ధతిని నేడు అవలంబిస్తున్నదని తెలుస్తున్నది. అందులో భాగంగానే ఎలాంటి కలుషిత వాతవారణానికి అవకాశం లేని నగరాలు, యూనివర్సిటీలు, పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆగస్టు 1న సీఎం రేవంత్రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌ఖాన్‌పేట్ ప్రాంతంలో స్కిల్యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
నిరుద్యోగులకు చక్కటి అవకాశం..
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్‌లోనూ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశారు. కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. మరికొంత మందికి రాత పరీక్షలు జరుగుతున్నాయి. నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నది. అయితే రాష్ట్రంలోకి రాబోతున్న నూతన కంపెనీల్లో తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయాత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే స్కిల్డెవలప్మెంట్యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఈ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించనున్నది. పెట్టుబడిదారులు ఏర్పాటు చేసే కంపెనీల్లో అందుకు అనుగుణంగా రూపొందించే విధానాలపై ముందుగా వృత్తినైపుణ్యం చేయనున్నారు. దాంతో ఏ కంపెనీల్లో అయితే ఆ నిరుద్యోగి నైపుణ్యం సాధిస్తారో అందులో ఉపాధి లభించే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీ మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్మండలం మీర్ఖాన్పేట్గ్రామ రెవెన్యూ పరిధిలోని 50 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కంపెనీలకు సంబంధించిన భూమి పూజలకు కాకముందే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఫార్మాను క్లస్టర్లుగా ఏర్పాటు చేసే అవకాశం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రాంతాల్లో సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని యోచించింది. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు 19 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం పలు దఫాలుగా 12వేల ఎకరాల భూమికి పైగా సేకరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. తమ సంస్థలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరశివార్లలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కాలుష్య రహితంగా, కర్బన ఉద్గారాల రహితంగా 'నెట్ జీరో సిటీ' నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.