- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బషీర్బాగ్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
దిశ, కార్వాన్ : 60 శాతం ఉన్న బీసీలకు టీఆర్ఎస్ పార్టీ కేవలం 21 ఎమ్మెల్యే సీట్లను కేటాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బీసీ పొలిటికల్ జేఏసీ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానె పరిగణిస్తూ అణగదొక్కుతున్నారని అన్నారు.
అరశాతం కూడా లేని వెలమ వర్గానికి 11 టికెట్లు, రెడ్డి సామాజిక వర్గానికి 40 సీట్లను కేటాయించడం కేసీఆర్ అగ్రకుల దురహంకారానికి నిదర్శనం అన్నారు. తక్షణమే బీసీలకు జనాభా ప్రాతినిధ్యం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సరైన సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలను మట్టుపెడతామని హెచ్చరించారు.