Hyderabad rains : ఇండ్ల నుంచి బయటకు రావొద్దు.. హైదరాబాద్ వాసులకు GHMC కీలక సూచన..!

by Satheesh |   ( Updated:2023-07-24 13:56:29.0  )
Hyderabad rains : ఇండ్ల నుంచి బయటకు రావొద్దు.. హైదరాబాద్ వాసులకు GHMC కీలక సూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారి కుంభవృష్టి వర్షం కురిసింది. దాదాపు అర్థగంట పాటు కురిసిన ఈ భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. కుంభవృష్టి వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల వల్ల.. రోడ్లపై భారీగా వరద నీరు చేరాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం దాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు.

లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు.. రోడ్లపై భారీగా చేరిన వరద నీటిని క్లియర్ చేసేందుకు సహయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటికి రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేవారు వర్షం తగ్గాకే బయటకు వెళ్లాలని సూచించారు. సహయక చర్యల కోసం 040-21111111, 9000113667 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Read More : Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పరిస్థితి ఇంత దారుణమా.. ?

Advertisement

Next Story