- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chepa Mandu: చేపమందు చరిత్ర మీకు తెలుసా
దిశ, వెబ్డెస్క్ : మృగశిర కార్తె ప్రారంభం కాగానే మనకి వినిపించే మాట చేపలు. ఈ కార్తెకు చేపలకు ఎంతో అనుబంధం ఉంది. అలాగే ఈ చేపలతో ఉబ్బసం జబ్బుకు మందు కూడా ఉందనేది మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ చేపమందు మొదట ఎక్కడ వేశారు. ఏ సంవత్సరంలో వేశారు. అసలు ఎలా వచ్చింది. అనే విషయాలు చాలా మందికి తెలియదు.
ఈ మందును మొదట 1847లో తయారు చేశారు. అప్పట్లో ఓ సాధువు దేశపర్యటన చేస్తూ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా బత్తిని వీరన్నగౌడ్ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు తయారు చేశారు. ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పి తయారు చేసే విధానం ఆయనకు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును పంపిణీ చేస్తున్నారు.
ఈ మందులో ఏమేమి ఉంటాయంటే
మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు ఉంటాయి.
కొరమేను చేప పిల్లలతో మందు పంపిణీ
చిన్న సైజు కొరమేను పిల్లలను ఈ చేపమందు పంపిణీకి ఉపయోగిస్తారు. వేయడానికి కొద్ది గంటల ముందు దీనిని తయారు చేసి బతికి ఉన్న కొరమేను చేప పిల్ల నోటిలో ఉంచి దానిని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నీటి ద్వారా వేస్తారు. దాంతో అది జీర్ణాశ్రయంలో మెల్లగా కరగడంతో పాటు గొంతు ద్వారా వెళ్లినప్పడు స్వరపేటికను కూడా శుద్ధి చేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా దీనిని మొదట పాలబస్తీలో పంపిణీ చేసే వారు. తరువాత క్రమంలో జనం ఎక్కువ కావడంతో నాంపల్లికి మార్చారు.
అలాగే బెల్లంతో కలిపి కూడా అందిస్తారు. కాగా దీనిపై అనేక మంది పలు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఇది అసలు మందే కాదన్నారు. దీనిలో సైన్స్ లేదన్నారు. ఆఖరికి కొందరు ప్రజలను మోసం చేస్తున్నారని కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టులో వీరి తరుపు న్యాయవాదుల వాదనలను విన్న తరువాత దీనిని మందు అనొద్దని ప్రసాదం అని పిలవాలని సూచించింది. అప్పటి నుంచి చేప ప్రసాదంగా పిలుస్తున్నారు. ఏది ఏమైనా వ్యాధి గ్రస్తులకు జబ్బు తగ్గితే అదే పదివేలు.