'డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌'

by Vinod kumar |   ( Updated:2023-09-20 13:58:37.0  )
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌
X

దిశ, సిటీ బ్యూరో: ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఇండ్ల కేటాయింపునకు మరో స్పెషల్ సాఫ్ట్‌వేర్‌‌ను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ నెల 21న నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రెండవ దశ పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాండమైజేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి పరిధిలోని 24 నియోజకవర్గాలకు సంబంధించిన టెక్నీషియన్లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న జరిగే ఇండ్ల పంపిణీ ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లు పాటించి ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లేదా మొదటి అంతస్తులోనే ఇళ్లను కేటాయించే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేసినట్లు తెలిపారు. ప్రక్రియ పూర్తికాగానే ఏర్పాటు చేసిన కౌంటర్లకు ఇండ్లు కేటాయించబడిన లబ్ధిదారుల లిస్టులను షేర్ చేయాలని సూచించారు. ఎవరైనా లబ్ధిదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్నారు. టెక్నీషియన్లు ఇళ్లను కేటాయించే కార్యక్రమంకు ఏర్పాటు చేసిన కేంద్రాలకు ఉదయాన్నే చేరుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటాచారి, ఎన్ఐసీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story