Ratan Naval Tata : ప్రారంభమైన రతన్ టాటా అంతిమయాత్ర

by M.Rajitha |   ( Updated:2024-10-10 11:22:51.0  )
Ratan Naval Tata : ప్రారంభమైన రతన్ టాటా అంతిమయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటాసన్స్ అధినేత రతన టాటా(Ratan Tata) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయనికి నివాళులు అర్పించారు. కాగా రతన్ టాటా అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితమే మొదలైంది. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్ నుండి వర్లీ వరకు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. వర్లీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కాగా మహానీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా జనం తరలి వచ్చారు.

Advertisement

Next Story