- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, భారతి నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 3 కోట్ల 34 వేల 800 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.
మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయన లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, వాటికి నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.
పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, నాగమణి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కిరణ్ యాదవ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.