ఓవైసీ విద్యా సంస్థలను కూల్చివేయండి

by Sridhar Babu |
ఓవైసీ విద్యా సంస్థలను కూల్చివేయండి
X

దిశ, చార్మినార్​ : బండ్లగూడలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా నిర్మించిన విద్యాసంస్థలను కూల్చివేయాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శివచంద్రగిరి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు అందజేసిన వినతి పత్రంలో చెరువు మధ్యలో నిర్మించిన ఫాతిమా స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో దళిత మోర్చా అధ్యక్షులు పగా రాజేశ్వర్, భారతీయ జనతా పార్టీ నాయకులు నర్సింగ్ రావు, పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed