వడదెబ్బ మృతులకు 20లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి : డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

by Sumithra |
వడదెబ్బ మృతులకు 20లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి : డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
X

దిశ, ముషీరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదలను ప్రకృతి విపత్తుల గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, వడదెబ్బ మృతులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 45, 47డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల నమోదు అవుతున్నందున ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఉపశమనం చర్యలు చేపట్టాలన్నారు. వడదెబ్బతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వంద మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. పాఠశాలలు కూడా అర్థరహితంగా ఈ ఎండల్లో రెండు పూటలా నడుపుతున్నారన్నారు.

మరీ ముఖ్యంగా రోడ్ల పై ట్యాంకర్లతో నీళ్ళు చల్లించడం, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లో చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. అందుకు ప్రభుత్వం, అధికారులు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాకారం తీసుకోవచ్చునన్నారు. పసిపిల్లలు ఉన్నవారిని ఈ పనులకు దూరంగా ఉంచాలని, అవసరం అయితే తెల్లరేషన్ కార్డు దారులకు మరో పది కిలోల బియ్యం ఉచితంగా అందజేయాలన్నారు. ఉష్ణోగ్రత పెరుగుదల కూడా ప్రకృతి విపత్తుగా పరిగణించి వడదెబ్బతో మరణించిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మంజూరి చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed