Crime News : గుర్తు తెలియని యువకుడి మృతి

by Kalyani |   ( Updated:2022-12-11 10:18:42.0  )
Crime News : గుర్తు తెలియని యువకుడి మృతి
X

దిశ, సికింద్రాబాద్: లాలాపేట ప్రధాన రహదారి రాం థియేటర్ సమీపంలో యువకుడు మృతి చెందిన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు ఓయూ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని యువకుడి(20) ని గుర్తించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. యువకుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. యువకుడిని గుర్తించిన వారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ 8712660569, 8712661263లకు కాల్ చేసి వివరాలు తెలుపాలని పోలీసులు కోరారు.

Advertisement

Next Story