Cyber Crimes: పెరిగిన సైబర్ నేరాలు.. అధికంగా మోసపోతోంది వాళ్లే : సీపీ సీవీ ఆనంద్

by Y.Nagarani |
Cyber Crimes: పెరిగిన సైబర్ నేరాలు.. అధికంగా మోసపోతోంది వాళ్లే : సీపీ సీవీ ఆనంద్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది హైదరాబాద్ లో సైబర్ నేరాలు 24 శాతం పెరిగాయని నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించార. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) హాక్ 2.0 పేరుతో ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ (Sikha Goel), సీపీ ఆనంద్ (CP CV Anand) హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో జరుగుతున్న డిజిటల్ అరెస్టులు (Digital Arrest) ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులే సైబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకుంటున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రాజస్థాన్ లో ఇటీవలే 28 మంది సైబర్ నేరస్తులను (Cyber Crime) అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్టైన నేరస్తులు దేశవ్యాప్తంగా 243 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, వాటిలో 28 కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయని చెప్పారు. సైబర్ నేరస్తులు సుదూర ప్రాంతాల్లో ఉండి నేరాలకు పాల్పడుతుండగా.. వారిని గాలించి, ఇతర రాష్ట్రాలకెళ్లి అరెస్ట్ చేయడం సవాళ్లతో కూడుకున్న పని అన్నారు. ఈ ఏడాది సైబర్ నేరస్తులు దోచిన రూ.35.8 కోట్ల సొమ్మును బాధితులకు తిరిగి అందజేశామని తెలిపారు.

Advertisement

Next Story