నీలోఫర్ హాస్పిటల్ లో కోవిడ్ కేసులు నమోదు

by Sridhar Babu |
నీలోఫర్ హాస్పిటల్ లో కోవిడ్ కేసులు నమోదు
X

దిశ, కార్వాన్ : 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కొవిడ్ సోకడంతో ఆస్పత్రిలో రోగుల బంధువుల ఆందోళనల నెలకొంది. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో పాటు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ నిలోఫర్ ఆసుపత్రికి వెంటిలేటర్ పై బాలుని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. కాగా అనుమానం వచ్చిన వైద్యులు కొవిడ్ పరీక్ష చేయగా 'పాజిటివ్'గా నిర్ధారణ అయింది. చిన్నారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారి శ్రీనివాస్ కల్యాణి తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలని వారు పేర్కొన్నారు.

నీలోఫర్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటు...

నీలోఫర్ ఆస్పత్రిలో మొదటగా కోవిడ్ కేసు నిర్ధారణ కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి వెంటనే కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం వైద్య పరీక్షల్లో రెండు నెలల చిన్నారి కి కూడా కోవిడ్ సోకినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. కోవిడ్ సోకిన వారు ఎలాంటి బయాందోళన అవసరం లేదని, అన్ని వసతులు ఆస్పత్రిలో సమకూర్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed