- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Maganti Gopinath : ఎమ్మెల్యే మాగంటి, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బీఆర్ఎస్‌లో ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. బీఆర్ఎస్ నేతల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వార్ కేసులు దాకా వెళ్లింది. బోనాల సందర్భంగా వెంగల్‌రావు నగర్‌లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫొటో చిన్నగా ఉండటంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా ఫ్లెక్సీ ఉండటంతో గణేశ్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే గోపీనాథ్ వర్సెస్ శ్రీధర్ రెడ్డిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ విషయాన్ని సర్దుమనిగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డిపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని వెంగల్ రావు నగర్ కార్పొరేటర్ దేదీప్య రావు కేసు పెట్టారు. ఓ ఫ్లెక్సీ ఏర్పాటుపై ఎమ్మెల్యేకు సంబంధంలేదని ఆమె ఆరోపించారు. తనపై రావుల శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేస్తే ఎమ్మెల్యే అడ్డుకున్నారని దేదీప్య రావు తెలిపారు.