Hospital: సన్ రైజ్ హాస్పిటల్ వైద్యునిపై కేసు నమోదు

by sudharani |   ( Updated:2022-09-01 14:33:53.0  )
Hospital: సన్ రైజ్ హాస్పిటల్ వైద్యునిపై కేసు నమోదు
X

దిశ, ఎల్బీనగర్: పేషెంట్‌ను, ఆమె తల్లిని దుర్భాషలాడిన సన్ రైజ్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కార్తీక్‌పై హయత్ నగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కాలికి గాయం కావడంతో ఆమె తల్లి జూలై 30వ తేదీన సన్ రైజ్ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్ళింది. అయితే హాస్పిటల్ యాజమాన్యం కాలికి అయిన చిన్న గాయానికి శస్త్ర చికిత్స చేసి ఐసీఏలో ఉంచి వైద్యం చేశారు.

ఇందుకుగాను హెల్త్ కార్డు ద్వారా రూ. లక్ష 50 వేల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. పేషంట్ డిశ్చార్జ్ అయిన పది రోజుల తర్వాత మెడిసిన్ కోసం ఆమె తల్లి, మేనమామ సన్ రైజ్ హాస్పిటల్‌కి వెళ్ళారు. అయితే హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ కార్తీక్ మెడిసిన్ ఇవ్వకపోగా రాయలేని భాషలో పేషెంట్ తల్లిని దుర్భాషలాడాడు. దీంతో పేషెంట్ మేన మామ డాక్టర్‌ను నిలదీయడంతో ఆయనపై కూడా విరుచుకు పడటంతో.. బాధితులు గత నెల 11వ తేదీన హయత్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సన్ రైజ్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కార్తీక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed