- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆటో ఢీకొనడంతో బాలుడికి తీవ్ర గాయాలు
దిశ, బహదూర్‌పుర: పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌక్ ప్రాంతంలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి ఆటో డ్రైవర్ టాటా ఏస్ వాహనాన్ని వెనకాలకి తీస్తుండగా అలీ అక్బర్ (10) అనే బాలుడు పైకి దూసుకెళ్లింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కోపదిక్తులైన బాలుని బంధువులు టాటా ఏస్ వాహనాన్ని పక్కనే ఉన్న మరో కారును ధ్వంసం చేశారు. నిత్యం ఇక్కడ అక్రమ పార్కింగ్ లతో, చెత్తకుప్పలతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్తున్నారని బస్తీ వాసులు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో చెత్తాచెదారం కొన్ని రోజులుగా పేరుకుపోయిందని స్థానికులు వాపోయారు. చెత్తాచెదారం అక్రమ పార్కింగ్‌లతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని బాలుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి బంధువులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.