మీరాలం చెరువులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం

by Sridhar Babu |
మీరాలం చెరువులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం
X

దిశ, చార్మినార్​ : మీరాలం చెరువులో 24 సంవత్సరాల గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని బహదూర్ పురా పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బహదూర్​పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం మీరాలం చెరువు నది ఒడ్డున 24 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు బహదూర్​పురా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న బహదూర్​పురా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చేపల వేటకు వెళ్లి చెరువులో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును బహదూర్​పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed