- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తం పార్టీకి బిగ్ షాక్.. 7న బీజేపీ భారీ బహిరంగ సభ
దిశ, తెలంగాణ బ్యూరో: సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 6న నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభ వాయిదా పడింది. ఒకరోజు తర్వాత దీన్ని నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయింది. ఈమేరకు బీజేపీ నేతలు స్పష్టతనిచ్చారు. బాబ్రీ మసీదు కూల్చిన తేదీ కావడంతో ఆరోజు ముస్లింలు బ్లాక్ డే నిర్వహించే అవకాశముంది. అందులోనూ ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం కావడం, అలాగే అదేరోజు ఆర్ఎస్ఎస్ విజయ్ దివస్ పేరిట ఉత్సవాలు చేసుకోవడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో 6వ తేదీ నుంచి 7వ తేదీకి మార్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 6న శుక్రవారం కావడంతో సభ సాధ్యం కాకపోవచ్చని, అందుకే 7న నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
సరూర్ నగర్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ అగ్ర నేతల్లో ఎవరో ఒకరిని తీసుకురావాలని పార్టీ భావించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల్లో ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 25 నుంచి మొదలయ్యాయి. ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈనెల 6వ తేదీన పార్లమెంత్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సభకు రాలేమని స్పష్టంచేశారని వినికిడి. అలాగే ఈనెల 6న అంబేద్కర్ వర్ధంతి సైతం ఉండటంతో అగ్ర నేతల షెడ్యూల్ బిజీగా ఉందని సమాచారం. ఈనేపథ్యంలో పార్టీ చేసేదేంలేక ఈనెల 7వ తేదీన నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
తెలంగాణలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఆ తేదీకంటే ఒక్కరోజు ముందే కాషాయ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించి వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేసింది. కానీ చివరకు పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రభుత్వం కొలువుదీరిన రోజే హస్తం పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని, కౌంటర్లకు ప్లాన్ చేసుకుంటోంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 7న జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఈటల రాజేందర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు సైతం ఉన్నారు. ఈ సభతో తెలంగాణలో బీజేపీ దూకుడును పెంచాలని పార్టీ భావిస్తోంది.