Hyd: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కేసీఆర్ మనుషులు.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2023-08-20 12:29:26.0  )
Hyd: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కేసీఆర్ మనుషులు.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మల్‌లో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌లో చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. అలాగే రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌ను ఈటల తప్పుబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మనుషులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లే మఫ్టీలో వెళ్లి రైతులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయంలో త్వరలోనే ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా మూడు నెలలే ఉంటుందని ఈటల జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటిదని.. అందువల్లే ఇప్పుడు వెలిగిపోతోందని ఈటల రాజేందర్ విమర్శించారు.

Advertisement

Next Story