వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

by Aamani |   ( Updated:2023-12-06 09:33:08.0  )
వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. రేపు (గురువారం) ఎల్బీ స్టేడియం, లక్డీకపూల్ సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకులు, సీఎంలు, పలువురు రాజకీయ ప్రముఖులు వస్తుండటంతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story