- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలను రాజకీయంగా అణిచి వేస్తున్నారు.. బీజేపీ నేత పల్లపు గోవర్ధన్
దిశ, ఖైరతాబాద్: అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నా కావాలనే బీసీల నాయకత్వాన్ని అగ్రకుల నాయకులు అణిచి వేస్తున్నారని బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ ఆరోపించారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తాజ్ మెన్షన్ లో బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ కుల ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో కలిసి పల్లపు గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లపు గోవర్ధన్ మాట్లాడుతూ.. అనాది నుంచి బీసీలు ఉత్పత్తి కులాలుగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు రాజకీయంగా అత్యంత వెనుకబడి పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బీసీలను రాజకీయంగా అణిచి వేస్తున్నారని ధ్వజమెత్తారు. కష్ట పడి పని చేసే బీసీ నాయకులను కుట్ర ప్రకారం అణగదొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు ఇవ్వాల్సని ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే బీసీల్లో చైతన్య పెరుగుతోందని, త్వరలోనే రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం ఖాయమని పల్లపు గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు.