పాతబస్తీలో దారుణం.. మైనర్ ​బాలురే టార్గెట్‌గా లైంగిక దాడి

by Vinod kumar |
పాతబస్తీలో దారుణం.. మైనర్ ​బాలురే టార్గెట్‌గా లైంగిక దాడి
X

దిశ, చార్మినార్: తన అసహజసిద్దమైన లైంగిక వాంఛ కోసం అందమైన మైనర్​బాలురను టార్గెట్​చేసి.. డబ్బుల ఆశచూపెట్టి.. బలవంతంగా మద్యం తాగించి.. మత్తులోకి చేరుకున్న మైనర్​బాలురపై పూలదండలు వేసి, లైంగిక దాడికి పాల్పడిన ఘటన భవానగర్​పోలీస్​ స్టేషన్​పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత జనవరి రెండవ వారంలో స్వలింగ సంపర్కానికి చెందిన ఓ వీడియో పాతబస్తీ సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యింది.

దీంతో ఆ వీడియో కాస్త భవానీనగర్​పోలీసుల కంట పడింది. దీంతో భవానీనగర్​పోలీసులు జనవరి 26వ తేదీన ఐపీసీ 342, 7, రెడ్​ విత్​8 ఫోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సుమోటోగా కేసును నమోదు చేశారు. ఆ వీడియోలో ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరని పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ముందుగా బాధితుడు ఓ మైనర్​ బాలుడిని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తలాబ్​కట్ట నషేమాన్​నగర్‌కు చెందిన ఇర్ఫాన్​ (30) గత రెండేళ్ళుగా డబ్బు ఆశ చూపి, బలవంతంగా మద్యం తాగించేవాడని, తాము మత్తులోకి చేరుకున్నాక లైంగిక దాడికి పాల్పడే వాడని బాదితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.

గత రెండేళ్లుగా తనపై అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడని పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో భవానీనగర్​పోలీసులు నిందితుడుని గుర్తించగా.. ఆ విషయం తెలుసుకున్న ఇర్ఫాన్​గోవాకు పరారయ్యాడు. నాలుగైదు రోజులు ఇర్పాన్​గోవాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి హైదరాబాద్​తలాబ్​కట్టకు చేరుకున్నాడన్న పక్కా సమాచారంతో ఇర్ఫాన్​ఇంటికి పోలీసులు చేరుకుని.. అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇర్ఫాన్​ఇక్కడ లేడని, బయట ఉన్నారని పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

పక్కా సమాచారంతో వచ్చామని ఇర్ఫాన్ ఇంట్లో ఉన్నాడని పోలీసులు తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు మిన్నకుండి పోయారు. దీంతో బాత్​రూమ్‌లో దాక్కున్న ఇర్ఫాన్​అక్కడ ఉన్న గుర్తు తెలియని పదార్థాన్ని సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భవానీనగర్​పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన పని లేదని అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ ​బాలురే టార్గెట్..

తన అసహజ సిద్ద లైంగిక వాంఛ కోసం పాతబస్తీ భవానీనగర్‌కు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన అందమైన మైనర్​బాలురకు వల విసిరేవాడు. అతని మాయాజాలంలో పడిన మైనర్​బాలురను తాను నివసించే గదికి తీసుకువెళ్ళేవాడు. అక్కడ మైనర్​బాలురకు బలవంతంగా మద్యం అలవాటు చేసేవాడు. వాళ్లు తాగి మత్తులోకి చేరుకున్నాక వాళ్ల చేతులకు మెడలో పూల దండలు వేసి.. తన లైంగిక వాంఛను తీర్చుకునేవాడు.

లైంగిక వాంఛ తీసుకునే సమయంలో తన మొబైల్‌లో చిత్రీకరించేవాడు. మరోసారి పిలిచినపుడు రాకపోతే ఆ వీడియోలు చూపెట్టి బెదిరించేవాడు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్​గుట్టు చప్పడుకాకుండా నడుపుతున్న ఈ వ్యవహారం కాస్త ఓ వీడియో బయటికి రావడంతో అతని గుట్టు రట్టయ్యింది. ఇర్ఫాన్​మొబైల్​ఫోన్​మరో 20 మంది మైనర్​బాలురకు సంబంధించిన లైంగిక దాడి వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story