- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం
దిశ, శేరిలింగంపల్లి : వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజీలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. తాము కాలేజీలో ఉండలేమని, ఈ ఒత్తిడిని తట్టుకోలేమని, తాము ఆత్మహత్యకు పాల్పడతామంటూ పలువురు విద్యార్థినీలు వాష్ రూమ్ లలో గోడలపై రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ డి మార్ట్ పక్కనే ఉన్న శ్రీ చైతన్య ఇన్ఫెనిటీ లర్న్ క్యాంపస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్యాంపస్ లో సుమారు 1500 మంది విద్యార్థినీలు చదువుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. తాము కాలేజీలో ఉండలేమని, ఈ ఒత్తిడి భరించడం తమ వల్ల కాదని, మాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ పలువురు విద్యార్ధినిలు వాష్ రూమ్ లలో రాసిన రాతలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
విద్యార్థినిలు గోడలపై రాసిన రాతలు గమనించిన కాలేజీ సిబ్బంది వాటిని చాలా వరకు చేరిపివేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఉన్నపళంగా విద్యార్థినీల తల్లిదండ్రులకు ఫోన్లు చేసిన శ్రీ చైతన్య కాలేజీ సిబ్బంది విద్యార్థినిలకు 4 రోజుల పాటు ఔటింగ్ ఇచ్చి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ కాలేజీ నుండి చాలా వరకు విద్యార్థినిలను వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి శక్తి ( ఎన్టీవీఎస్ ) స్టూడెంట్స్ యూనియన్ నాయకులు శ్రీ చైతన్య కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న కాలేజీ యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు: విద్యార్ధినీలు
శ్రీ చైతన్య కాలేజీ అధ్యాపకులు, అకడమిక్ ప్రిన్సిపల్ తమపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని, చదువు, మార్కులు అంటూ ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారని పలువురు విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్ గర్ల్స్ క్యాంపస్ లో గతంలో ఓ విద్యార్థిని బ్లేడ్ తో చెయ్యి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందని, గత వారం మరో అమ్మాయి మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని తెలిపారు. వరుస ఘటనలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని విద్యార్థినిలు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇళ్లకు వెళుతున్న వందలాది మంది విద్యార్థినీలు
మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న సుమారు 1500 మంది విద్యార్థినీల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఇప్పటికే చాలామంది తలిదండ్రులని పిలిచి 3 రోజుల ఔటింగ్ కు పంపించారు. మిగతా విద్యార్ధినిలు తమను కూడా ఇళ్లకు పంపించాలని ఇక్కడ ఉండలేమని చెబుతున్నారు.
మా దగ్గర ఎలాంటి సమస్యలేదు.. కాలే జీ డీన్ దీపక్..
మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఎలాంటి సమస్య లేదని, పిల్లల తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారని, 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన వారిని ఇక్కడ చేర్పించారని, వారు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని, తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక సెలవులు కావాలని గోడలపై రాతలు రాస్తున్నారని కాలేజీ డీన్ దీపక్ అన్నారు.